VIDEO: మడకశిరలో భారీ బైక్ ర్యాలీ
సత్యసాయి: మడకశిర పట్టణంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మడకశిర ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రొల్ల మండలం ఎన్టీఆర్ సర్కిల్ వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.