గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరుకి గాయాలు

అన్నమయ్య: కురబలకోట మండలంలో అంగళ్లు హైవేపై గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మొలకలచెరువుకు చెందిన సురేష్, బికొత్తకోటకు చెందిన శ్రీనాథ్ మదనపల్లికి బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం వారిని ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను హుటాహూటిన కురబలకోట 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.