విజయవాడలో "ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన" పై అవగాహన

విజయవాడలో "ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన" పై అవగాహన

ఎన్టీఆర్: విజయవాడలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1000 మంది మహిళలతో "ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన" పై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA బోండా ఉమ పాల్గొని, పథకం ద్వారా ఉచిత సౌర విద్యుత్ సదుపాయంతో ప్రజలకు ఆర్థికంగా లాభం కలుగుతుందని, పర్యావరణహిత సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు.