నేడు పెంటకోటలో హోంమంత్రి పర్యటన

నేడు పెంటకోటలో హోంమంత్రి పర్యటన

AKP: హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ సాయంత్రం 4గంటలకు పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలో పర్యటించనున్నట్లు నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి తన పర్యటనలో భాగంగా కమ్యూనిటీ హాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.