అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్

అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్

అమెరికాతో అణు ఒప్పందం చర్చలపై ఇరాన్ యూటర్న్ తీసుకుంది. దాడుల తర్వాత చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగశాఖ ప్రకటించింది. తాజాగా ఈ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ వెల్లడించారు. అమెరికాతో ఎలాంటి చర్చల్లో పాల్గొనే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దౌత్యపరమైన వ్యవహారాల్లో అమెరికాది చెత్త రికార్డు అంటూ మండిపడ్డారు.