పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MEO

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MEO

KRNL: ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MEO శోభా వివేకావతి ఇవాళ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 1,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే పోలీస్ స్టేషన్‌కు చేరాయని, కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించారు.