పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

NRPT: పెద్దకొత్తపల్లి మండలం కొత్తయాపట్ల యూపీఎస్ పాఠశాలలో బుధవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలుబోధించారు. డీఈవోగా నవీన్, ఎంఈవోగా మహేశ్వరి, HMగా హర్షిత వ్యవహరించారు. చక్కగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యూష పాల్గొన్నారు.