రవితేజ 'RT76' టైటిల్ ఇదే

రవితేజ 'RT76' టైటిల్ ఇదే

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం 'RT76'. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే పేరును ఖరారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.