VIDEO: మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

SRPT: తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే మహనీయుల విగ్రహాలను శనివారం ఎమ్మెల్యే సామేలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.