ఘనంగా ఏఐటీయూసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఏఐటీయూసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

MNCL: జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యాలయం ఆవరణలో ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసి నిత్యం పోరాడుతోందని తెలిపారు.