గిరిజనుల కోసం ప్రత్యేకంగా వైద్య సెల్ ఏర్పాటు

గిరిజనుల కోసం ప్రత్యేకంగా వైద్య సెల్ ఏర్పాటు

VZM: కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గిరిజనుల కోసం ఎస్టీ సెల్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌వో జీవన్ రాణి శుక్రవారం తెలిపారు. గిరిజన గ్రామాల నుంచి వచ్చే గిరిజనుల కోసం తక్షణ వైద్య సేవలు అందించుట, వారి రోగ నిర్దారణ బట్టి అవసరమైన విభాగాలకు తరలించడానికి ఎంతో మెరుగుపడుతుందని ఆమె తెలిపారు. అలాగే వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.