VIDEO: మహిళలకు చీరలు పంపిణీ చేసిన నాగబాబు సతీమణి

KKD: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ వరలక్ష్మి వ్రతాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం దంపతులు వస్తారని మొదట ప్రచారం జరిగినప్పటికీ, నాగబాబు సతీమణి విచ్చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె వ్రతాలలో పాల్గొన్న మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు.