విద్యార్థి వీసా.. భారీగా తిరస్కరిస్తోన్న కెనడా!

విద్యార్థి వీసా.. భారీగా తిరస్కరిస్తోన్న కెనడా!

ఈ ఏడాది దాదాపు 62 శాతం స్టూడెంట్ వీసా దరఖాస్తులను కెనడా తిరస్కరించినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే వీటిలో ఎక్కువ శాతం భారతీయ విద్యార్థలవేనని తెలిపింది. గత పదేళ్లలో కెనడా ఈ స్థాయి తిరస్కరణలు ఎన్నడూ చేయలేదని పేర్కొంది. నివాసాల కొరత, మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బందిగా మారడం, స్థానిక ఖర్చులు విద్యార్థులు భరించగలరా? అన్న కోణంలో కెనడా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.