నిబంధనలు పాటించకపోతే చర్యలు: MPDO
W.G: నిబంధనలకు అనుగుణంగా గోదావరిలో పంటు రాకపోకలు సాగించాలని, లేనిపక్షంలో శాఖపరంగా చర్యలు తీసుకుంటామని నరసాపురం MPDO ఎం. నాసరురెడ్డి హెచ్చరించారు. సోమవారం మాధవాయిపాలెం రేవును MPDO సందర్శించారు. పంటు సామర్థ్యం ఎంత, ఎంత మంది ప్రయాణిస్తున్నారు. 2రేవుల మధ్య దూరం, లైఫ్ జాకెట్లు, పంటు పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.