రమేశ్ కుటుంబానికి మందకృష్ణ మాదిగ పరామర్శ
KRNL: తుగ్గలి మండలం బొందిమడుగులలో దారుణ హత్యకు గురైన రమేశ్ కుటుంబాన్ని మంగళవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. దళిత నాయకుడి హత్యను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసు అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇందులో ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.