VIDEO: 'పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి'

SKLM: పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాలని శ్రీకాకుళం సీపీఐ పార్టీ కార్యదర్శి డి.గోవిందరావు, వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని మండిపడ్డారు. తక్షణమే ధరలు ఉపసంహరించుకోవాలన్నారు.