శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో చిరుజల్లులు

శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో చిరుజల్లులు

శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో ఉదయం నుంచి వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం నైరా, అలికాం ప్రాంతాల్లో స్వల్పంగా చిరుజల్లులు కురిశాయి. ఈ వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ప్రజలు సేద తీరారు. ఈ వర్షం పంటలకు ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.