ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బుట్టాయిగూడెం రోడ్డు ఎస్‌బీఐ బ్యాంకు వద్ద బైకును లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మహిళ తల నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.