ఇరు నాయకత్వాల పట్ల గర్వంగా ఉంది: ట్రంప్

భారత్, పాక్ కాల్పుల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పోస్ట్ పెట్టాడు. చారిత్రక నిర్ణయానికి అమెరికా సాయపడటం గర్వంగా ఉందన్నారు. రెండు దేశాలతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని స్పష్టం చేశారు. భారత్, పాక్ బలమైన నాయకత్వాల పట్ల గర్వపడుతున్నానని వెల్లడించారు. వెయ్యేళ్ల తర్వాతైనా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో పరిశీలించేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు.