'ఆగస్టు 15కు సర్వం సిద్ధం'

కృష్ణా: మచిలీపట్నం ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు పరేడ్ రిహార్సల్స్ గురువారం పరిశీలించారు. అతిథులు, ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక గ్యాలరీలు, వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్య్ర వేడుకల్లో భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు.