రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: కలెక్టర్
కృష్ణా: రహదారి ప్రమాదాల నివారణకు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ DK బాలాజీ ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశంలో బ్లాక్ స్పాట్లపై తీసుకున్న చర్యలను సమీక్షించి, మిగిలిన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాత్రివేళ డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు అతికించడంతో పాటు హైవేలపై RTC బస్సులకు ZPS పరికరాలు అమర్చాలని తెలిపారు.