VIDEO: హన్మకొండలో చైన్ స్నాచింగ్ ఘటన–కేసు నమోదు
HNK: హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీ పరిధిలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో సోమవారం చైన్ స్నాచింగ్ చోటుచేసుకుంది. చింతల కల్పన ఉప్పు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి, ఆమె మెడలో ఉన్న సుమారు 28 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రంజిత్ కుమార్ తెలిపారు.