గోదావరిలో దిగి ఐదుగురు గల్లంతు

గోదావరిలో దిగి ఐదుగురు గల్లంతు

ELR: గోదావరి నదిలోకి దిగిన ఐదుగురు యువకులు గల్లంతైన ఘటన పోలవరం జిల్లా ఏటపాక మండలం కూనవరం వద్ద జరిగింది. భద్రాచలానికి చెందిన ఏడురుగు స్నానం కోసం నదిలోకి దిగారు. ఈ క్రమంలో లోతు తెలియక ఐదుగురు గల్లంతవగా.. మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బోట్లు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.