తాము ముందస్తు దాడులు చేయం: ఇరాన్
తాము ఏ దేశంపై ముందస్తు దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తెలిపారు. కానీ తమ మౌలిక సదుపాయాలు, అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. శత్రు స్థావరాలు భూస్థాపితం అయ్యే వరకు తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. అలాగే తమ శత్రువులకు సహకరించిన దేశాలను వదలమని పేర్కొన్నారు.