VIDEO: వామపక్ష నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
KMM: వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) పిలుపునిచ్చిన జిల్లా బంద్ ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వారికి అదే ప్రాంతంలో గృహాలు నిర్మించాలని నాయకులు డిమాండ్ చేశారు. జడ్పీ సెంటర్ వద్ద నిరసనకు యత్నించిన సీపీఐ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు