చీరల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకున్నాం: కలెక్టర్
NZB: మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చీరల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు తొలి విడతలో చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.