అప్పటి వరకు రోహిత్, కోహ్లీ ఆడొచ్చు: గంభీర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లీపై హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ బాగా ఆడుతున్నంత కాలం జట్టులో కొనసాగొచ్చని తెలిపాడు. సత్తాచాటుతుంటే 40 ఏళ్లేంటి.. 45 వరకు కూడా ఆడొచ్చని అన్నాడు. అలాగే, 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? లేదా? అన్నది వారి వ్యక్తిగత ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని వెల్లడించాడు.