వలకు చిక్కిన భారీ చేప

CTR: సదుం మండలం తిమ్మానాయనిపల్లె పంచాయతీ కొర్లకుంటవారిపల్లె ప్రాజెక్టు నుంచి గార్గేయ నదికి వరద నీరు వస్తోంది. ఈక్రమంలో పలువురు యువకులు సరదాగా చేపల వేటకు వెళ్లారు. ఇందులో సుమారు 14 కిలోల మారవ చేప వలకు చిక్కింది. భార్గవ్ అనే యువకుడు వేసిన వలకు సుమారు మూడడుగుల పొడవున్న ఈ చేప చిక్కుకోవడంతో సంతోషం వ్యక్తం చేశాడు.