ఏప్రిల్ 13న బీటెక్ ఫైనల్ సెమ్ పరీక్షలు
TPT: ఎస్వీయూ పరిధిలో బీటెక్ అన్ని బ్రాంచ్‌లలో చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 8వ సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల 13వ తేదీన జరగనున్నాయి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 18వ తేదీలోపు ఫీజు చెల్లించి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు వచ్చేనెల 10వ తేదీన జారీ చేయనున్నట్లు తెలిపారు.