రహదారి భద్రతపై కఠిన నిర్ణయాలు
VZM: జిల్లాలో రహదారి భద్రతపై ఎస్పీ దామోదర్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా మితిమీరిన లోడుతో ప్రయాణించే లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంగిస్తే కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు.