నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాములలంక, చినపులిపాక, రొయ్యూరు, బొడ్డుపాడు, తోడేళ్ల దిబ్బలంక గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తామన్నారు. ఈ ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.