ఊరట్టంలో తాగునీటి సమస్య.. మహిళల ఆవేదన
MLG: తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామంలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆదివారం స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ.. 2023లో మిషన్ భగీరథలో ఇంటింటికి పైప్‌లైన్ వేశారని, అయితే నేటి వరకు నీరు సరఫరా కావట్లేదని మండిపడ్డారు. మేడారం జాతరకు కోట్లు ఖర్చు చేస్తున్నారని, తమ గ్రామానికి తాగునీరు అందించాలని కోరారు.