VIDEO: ఏటూరునాగారంలో కోతుల సమస్యకు పరిష్కారం
MLG: ఏటూరునాగారం గ్రామంలో కోతుల బెడదను తగ్గించేందుకు సర్పంచ్ శ్రీలత ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. తొలి విడతలో 89 కోతులను పట్టుకుని ఛత్తీస్‌గఢ్ అడవుల్లో వదిలించారు. నిపుణుల బృందంతో చేపట్టిన ఈ చర్యతో గ్రామంలో కోతుల బెడద గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. ఇంకా సమస్య ఉన్న ప్రాంతాల నుంచి సమాచారం అందించాలని, పూర్తిగా నివారణ వరకు చర్యలు కొనసాగిస్తామన్నారు.