పేట్ సంఘంలో రేపటి నుంచి మూడు రోజుల జాతర

పేట్ సంఘంలో రేపటి నుంచి మూడు రోజుల జాతర

SRPT: గాంధారి మండలం పేట్ సంఘంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జాతర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరలో భాగంగా మొదటి రోజు ఎడ్లబండ్ల ఊరేగింపు, రథోత్సవం, కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. ఈ మహోత్సవానికి పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.