విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

HYD: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం రాంనగర్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనేత ముఠా జైసింహ, కార్యకర్తలు పాల్గొన్నారు.