నారాయణస్వామి ఒక్కరోజు ఆదాయం ఎంతంటే..?
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలిసి ఉన్న నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ. 2,50,980ల ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.