ధర్మవరంలో ఘనంగా బాలల దినోత్సవం

సత్యసాయి: ధర్మవరంలో బాలల దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. కాలేజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్ వరకు విద్యార్థులతో కలసి ర్యాలీ చేపట్టామన్నారు. అనంతరం పిల్లల చేతికి పెన్ను ఇవ్వండి, బాల కార్మికులుగా మారకండి అంటూ నినాదాలు చేశారు.