'బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ'

ADB: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన మంగళి అశోక్, కమ్మరి బాలి ఇంట్లోని సరుకులు తడిసిపోయి నిరాశ్రయులయ్యారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి వెంటనే స్పందించి వారికి రేషన్ కిట్లు మంగళవారం అందజేశారు. రాంచందర్ రెడ్డి, చిరంజీవి, తదితరులున్నారు.