'తాగునీటి సమస్య పరిష్కరించాలి'
ASR: అరకువేలి మండలం బస్కి పంచాయతీ గాయిబంధ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్న స్వామి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పీ.గంగాధర్ కోరారు. ఈమేరకు, సోమవారం స్థానికులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన పిజిఆర్ఎస్ లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 40 ఇళ్లు, సుమారు 120 మంది జనాభా ఉన్నారన్నారు.