ఎక్స్‌పైరీ ఇంజెక్షన్ విక్రయం.. మెడికల్ షాపుపై కేసు

ఎక్స్‌పైరీ ఇంజెక్షన్ విక్రయం.. మెడికల్ షాపుపై కేసు

ADB: వన్‌టౌన్ పరిధిలో కాలం చెల్లిన ఇంజెక్షన్ విక్రయించిన మెడికల్ షాపుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్ కురేషి తన కుమారుడి కోసం కొన్న మందులు ఎక్స్‌పైరీ అయినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ సునీల్ కుమార్ విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. మందులు కొనేటప్పుడు ప్రజలు గడువు తేదీని తప్పనిసరిగా గమనించాలని పోలీసులు సూచించారు.