రేపు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న ఎమ్మెల్యే

రేపు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రేపు ఫరూఖ్ నగర్, కొందుర్గు, షాద్ నగర్ టౌన్, చౌదరిగూడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించనున్నారు. అనంతరం నందిగామ మండలం చేగూర్ గ్రామంలో PACS సొసైటీలో వరి, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.