'పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి'
NGKL: అచ్చంపేట పట్టణ అభివృద్ధికి ప్రజలు సకాలంలో ఇంటి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులు చెల్లించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ డి. మురళి కోరారు. పన్ను బకాయిల వసూళ్ల కోసం సిబ్బంది ఇంటింటికి వస్తున్నారని, ప్రజలు వారికి సహకరించి బిల్లులు సకాలంలో చెల్లించాలని ఆయన పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.