తుది జాబితా 2 రోజుల్లో తయారు చేయాలి: కలెక్టర్

PDPL: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితా 2 రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ధ్రువీకరణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.