రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల కలకలం

రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల కలకలం

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో కల్తీ పాలు కలకలం రేపింది. పాల సేకరణ నిర్వాహకుడు శ్రీశైలం గౌడ్ కృత్రిమ పాలు తయారు చేసి డైరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో, మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో భారీగా కృత్రిమ పాలను, వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.