మధ్య దళారుల ప్రమేయం వద్దు
MNCL: రైతులు పండించిన పంట ధాన్యాల కొనుగోలు సమయంలో మధ్య దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కొండగొర్ల లింగన్న కోరారు. బుధవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు వేసిన వరి, పత్తి, తదితర పంటలు కోత దశకు చేరుకున్నాయన్నారు. చాలా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభిస్తున్నారని తెలిపారు.