వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం
NGKL: జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఏప్రిల్ 24 నుండి జూన్ 7, 2026 వరకు శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత గల క్రీడాకారులు సంబంధిత కోచ్‌ల ద్వారా, జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 23లోపు IDOC భవనంలో సమర్పించాలని జిల్లా యువజన క్రీడా శాఖ సూచించింది.