అంధకారంలో చిట్యాల.. ఇబ్బందుల్లో ప్రజలు

అంధకారంలో చిట్యాల.. ఇబ్బందుల్లో ప్రజలు

NLG: చిట్యాల పట్టణం శుక్రవారం రాత్రి అంధకారంలో మునిగిపోయింది. రాత్రి 7 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంట్ నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, విద్యుత్ శాఖ సిబ్బంది ఎవరూ అందుబాటులో రాలేదు. ఈ అసౌకర్యానికి పట్టణ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి 8.45 కు కరెంటు వచ్చింది.