జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా వాసులు

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా వాసులు

JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన వంశీ, మెట్‌పల్లిలోని వర్షకొండ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న జెట్టిపల్లి అశోక్ ఎంపికయ్యారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో గత ఆదివారం జరిగిన సెలెక్షన్ అండ్ ట్రయల్స్‌లో సీనియర్ పురుషుల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి వీరు జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ టీంకు ఎంపికయ్యారు.