రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ప్రకాశం: టంగుటూరు మండలం బాపూజీ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ముందు వెళ్తున్న లారీని మరో లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. మొదట ప్రమాదంలో చింత భాస్కర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలై, ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.