VIDEO: అద్భత దృశ్యం.. రామలింగేశ్వరుని తాకిన సూర్యకిరణాలు
ప్రకాశం: జరుగుమల్లి మండలం నర్సింగోలులో ఉన్న శ్రీ శనీశ్వరాలయంలో మంగళవారం ఉదయం అద్భుత ఘటన చోటుచేసుకుంది. గుడిలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ఉదయభానుడు స్పృశించాడు. సంవత్సరంలో 2 సార్లు ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో ఇలా సూర్యకిరణాలు పడతాయని ఆలయ అర్చకులు వెంకట రమణయ్య శాస్త్రి తెలిపారు. ఈ సమయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయని అన్నారు.